ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Leaders_Fires_on_YCP

ETV Bharat / videos

Janasena Leaders Fires on YCP: 'పోలీసులు ఐపీసీని కాదు.. వైసీపీని అమలు చేస్తున్నారు'.. 'రాజకీయ నాయకులా.. రాక్షసులా?' : జనసేన - జనసైనికునిపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 5:06 PM IST

Janasena Leaders Fires on YCP Government: ఏపీ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)ని కాకుండా వైసీపీని అమలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ  అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్​ కాంగ్రెస్ పార్టీ​ నాయకుల దాడిలో గాయపడి.. పలమనేరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు మధుసూదన్​, అతడి కుటుంబ సభ్యులను హరిప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన పలమనేరు ఎమ్మెల్యేను మధుసూదన్​ ప్రశ్నించాడని.. అది తట్టుకోలేని వైసీపీ నాయకులు అతనిపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ ప్రశ్నించేందుకే పుట్టిందని.. జనసైనికులపై ఎన్ని దాడులు చేసినా వారు ప్రశ్నిస్తూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల సాక్షిగా దాడులు జరిగితే.. నామ మాత్రానికే వారు కేసు నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసును హత్యాయత్నంగా నమోదు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే.. వారి గుండెల్లో ఉండేలా పాలన చేయాల్సిన జగన్.. వారి ఇంటిపై స్టిక్కర్ల రూపంలో మాత్రమే ఉండాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details