వేంకటేశ్వర స్వామి స్థానంలో జగన్ ఫొటో - జనసేన ఇన్‍ఛార్జ్ కిరణ్ ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 12:06 PM IST
Janasena Leader Fired on CM Jagan Photo Printing on House Documents: ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో టీటీడీలో ఉద్యోగం చేస్తున్న 1750 మందికి ఇస్తున్న ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫొటో ముద్రించటం దారుణమని జనసేన నాయకులు విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును తిరుపతి జనసేన ఇన్‍ఛార్జ్ కిరణ్ ఖండించారు. వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తే వేంకటేశ్వర స్వామి ఫొటో స్థానంలో జగన్ ఫొటో పెడతారని వ్యాఖ్యానించారు.
Janasena Incharge Kiran Demand To Remove Jagan Photo: ఇంటి పట్టాలపై ముద్రించిన జగన్ ఫొటో, నవరత్నాల ప్రచారాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఖండించకపోతే జగన్మోహన్ రెడ్డి బ్రేక్ దర్శనం, జగన్ తోమలసేవ, జగన్ అర్చన సేవ, జగన్ సుప్రభాతసేవ, జగనన్న దర్శనాలు అని పేర్లు పెడతారని కిరణ్ ఎద్దెవ చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని రెండు రోజులు వాయిదా వేసి జగన్ ఫొటోను తొలగించకపోతే పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అడ్డుకుంటుందని కిరణ్ హెచ్చరించారు.