Janasena Gaade Fire సంస్కారం కోల్పోయి సీఎం జగన్ మాట్లాడుతున్నారు.. స్కిప్ట్ రాసేవారిని మార్చాలి: జనసేన నేత గాదె - ap newss
JanaSena Leaders Condemned CM Jagan Comments on Pawan Kalyan in Guntur : జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుంటూరు జనసేన నేతలు ఖండించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ మోహన్ రెడ్డి సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏదో బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్లిన సీఎం... ఆ పని చేయటానికి కూడా భయపడి పవన్ కల్యాణ్‌పై అనుచితంగా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కి స్క్రిప్ట్ రాసేవారిని ఇప్పటికైనా మార్చాలని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం ఇలాగే మాట్లాడితే తాము కూడా సంస్కారం కోల్పోయి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్ఛరించారు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నారని.. జగన్ కుటుంబంలో కొందరు పెళ్లి కాకుండానే సంసారాలు చేస్తున్న విషయం చూసుకోవాలని హితవు పలికారు. వైఎస్ కుటుంబ చరిత్ర హత్యలు, దోపిడీలతో మొదలైందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని గాదె వెంకటేశ్వరరావు అన్నారు.
TAGGED:
Janasena Gade on CM Comments