ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pothina Mahesh On Houses: 'సెంటు భూమి పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు' - AP TOP NEWS TODAY

🎬 Watch Now: Feature Video

ఇంటి పట్టాలపై పోతిన మహేష్ వ్యాఖ్యలు

By

Published : May 26, 2023, 3:47 PM IST

Pothina Mahesh Coments On House Rails : రాజధాని అమరావతిలో సెంటు భూమి పేరుతో పేదలు, సామాన్య ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్​చార్జ్​ పోతిన మహేష్ అన్నారు. నగరంలోని ఇల్లు లేని పేదలందరినీ ఒకేలా చూడాలని, ఒకే విలువైనటువంటి సెంటు భూమిని పంపీణీ చేయాలన్నారు. విజయవాడ నగరంలోని ఇల్లు లేని పేద ప్రజలందరికీ విజయవాడ నగరంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహ సముదాయాలు నిర్మించాలన్నారు. 'నాడు అమరావతి దండగ అన్నారు... నేడు అమరావతిలో ఇళ్ల పట్టాల పండుగ అంటున్నారు' ఇదేం దుర్మార్గమని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం నిర్మాణానికి పనికి రాదని, ముంపు ప్రాంతమని, శ్మశానమని, ఎడారి అని, సంవత్సరానికి నాలుగు పంటలు పండే ప్రాంతం అన్నారు. నేడు ఏ ప్రాతిపదికన అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాలు పంచుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. కోర్టులో కేసు ఓడిపోతే విజయవాడ నగరంలోని పేదలు, సామాన్య ప్రజల భవిష్యత్తు ఏంటో జగన్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details