ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena Leader Kiran Royal on AP Ministers

ETV Bharat / videos

Janasena Leader Kiran Royal on AP Ministers: చంద్రబాబు, పవన్​పై విమర్శలు చేస్తే సహించేదే లేదు: కిరణ్​ రాయల్ - Janasena Leader Kiran Royal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 7:42 PM IST

Janasena Leader Kiran Royal on AP Ministers: ప్రజలంతా రాష్ట్ర మంత్రుల వెంటపడి తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‍ కల్యాణ్​ను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి అమర్నాథ్​పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లలేక భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి రోజాకు సాటి మహిళా మంత్రులు, తెలుగు సినీపరిశ్రమకు చెందిన పలువురు మహిళల మద్దతు లేదన్నారు. రోజాకు మద్దతిచ్చిన రాధిక, ఖుష్బూలకు ఆమె ఆగడాలు తెలియవన్నారు. ఎవరెవరి మీద రోజా విమర్శించిందో రాధిక, ఖుష్బూలకు తమిళంలో మాట్లాడి తెలియజేశారు. ప్రపంచంలోనే మంత్రి రోజా చాలా ప్రమాదకరమన్నారు. మంత్రి రోజా ఆగడాల మీద పూర్తి సమాచారం తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందన్నారు. తిరుపతి జిల్లాలో దొంగఓట్లపై టీడీపీ, జనసేన కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని కిరణ్‍ రాయల్‍ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details