దసపల్లా భూముల్లో రహదారి విస్తరణపై హైకోర్టు స్టే - ప్రభుత్వానికి చెంపపెట్టు : మూర్తియాదవ్ - Murthy Yadav latest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 3:06 PM IST
Janasena Corporater Murthy Yadav On Daspalla Lands: దసపల్లా భూముల్లో (Dasapalla Land) రహదారి విస్తరణపై హైకోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అన్నారు. వైసీపీ నాయకులకు లాభం చేకూరేలా వ్యవహరించిన జీ.వీ.ఎమ్.సీ (G.V.M.C) కమిషనర్ సాయికాంత్ వర్మను సస్పెండ్ చేయాలని, మేయర్ హరి వెంకటకుమారిని భర్తరఫ్ (Dismissal) చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Murthy Yadav Comments on YSRCP: ప్రతిపాదనలకు సహకరించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఓఎస్డీ పాత్రపైనా విచారణ జరపాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా వైసీపీ అనుచరులకు అనుకూలంగా రహదారి అభివృద్ధి ప్రణాళిక (Road Development Plan) మార్చారని, దసపల్లా భూములపై మాట్లాడినందుకు లీగల్ నోటీసులు పంపించారని మూర్తియాదవ్ మండిపడ్డారు. గతంలో దసపల్లా భూములను కొట్టేస్తున్నారంటూ ఆరోపించిన మంత్రి అమర్నాథ్ ఇప్పుడు భూములు విజయసాయి చేతిలోకి వెళ్లడంతో నోరెత్తడం లేదని ధ్వజమెత్తారు.