Pawan tweet on Jagan: 'పాపం పసివాడు' క్లాస్ వార్ గురించి తెలుసుకో..: పవన్ - AP Latest News
Pawan Kalyan tweet on Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్షాలను ఉద్దేశించి చేసిన క్లాస్ వార్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ల పర్వం కొనసాగుతోంది. బుధవారం నాడు సీఎం జగన్పై పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇవాళ కథాకళి పేరుతో ఓ వీడియోని ట్వీట్ చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ గురించి చేసిన వ్యాఖ్యలు.. వాటికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అధికార ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ మధ్య జరిగిన చర్చకు సంబంధించి వీడియో జతపరిచారు. ఆరు చోట్ల ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేదల పక్షపాతిగా మాట్లాడటం విడ్డూరమని వారు అభిప్రాయపడ్డారు. బహుశా జగన్ క్యాష్ వార్ గురించి మాట్లాడి ఉంటారని చర్చలో అభిప్రాయపడ్డారు. ఆ వీడియోకు పాపం పసివాడు జగన్ కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలనే వ్యాఖ్యను పవన్ జోడించారు.