ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Janasena Chief Pawan Kalyan on Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు.. ప్రభుత్వ వైఖరి అమానవీయం: పవన్ - Chandrababu Health condition

🎬 Watch Now: Feature Video

Janasena Chief Pawan Kalyan on Chandrababu Health

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 1:00 PM IST

Updated : Oct 15, 2023, 1:27 PM IST

Janasena Chief Pawan Kalyan on Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ తీరు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. 

ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని హితవు పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడంతో పాటు.. చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Last Updated : Oct 15, 2023, 1:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details