ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pawan Kalyan on Alliance

ETV Bharat / videos

Pawan on Alliance: "పొత్తులకు ఇంకా సమయం ఉంది.. వైసీపీ పతనమే లక్ష్యం" - పవన్​ వారాహి

By

Published : Jul 9, 2023, 7:19 AM IST

Pawan Kalyan on Alliance: పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కష్టపడి పనిచేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని.. దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న మలి దశ వారాహి విజయ యాత్రకు అందరూ సహకారం అందించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారాహి విజయ యాత్ర కమిటీలతో పవన్‌ సమావేశం అయ్యారు. వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషిని.. పవన్‌ అభినందించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ చూడాలంటే.. ఆ పార్టీ పతనం గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం కావాలని పవన్‌ పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details