ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pawan kalyan Varahi Yatra

ETV Bharat / videos

Pawan Varahi Yatra: 'మనల్నెవడురా ఆపేది'.. ఉత్సాహంగా పవన్ వారాహి యాత్ర - పవన్ వీడియోలు

By

Published : Jun 14, 2023, 10:23 PM IST

Pawan kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైన నేపథ్యంలో... నేడు కాకినాడ జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో పాల్గొనేముందు పవన్ భారీ వాహన ర్యాలీగా సభ స్థలికి చేరుకున్నారు.  జనసేన కార్యకర్తలు, అభిమానులు  పవన్ కల్యాణ్​ను అనుసరిస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో పవన్ వాహనం ప్రారంభమైంది మెుదలు వారాహి వాహనం చేరే వరకూ రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. పవన్ కల్యాణ్​ను చూడటానికి జనం ఎగబడ్డారు. పవన్ వారాహి యాత్ర మెుదట గోదావరి జిల్లాల్లోని.. పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుకుంటుంది.  యాత్రలో భాగంగా నిర్వహించే జనవాణి కార్యక్రమంలో సమస్యలతో కష్టాలు పడుతున్న వారి బాధలను పవన్‌ తెలుసుకుంటారు. ప్రజలిచ్చే విజ్ఞాపనలు పరిశీలించి.. సంబంధిత శాఖలకు తెలియచేసి పరిష్కారం కోసం కృషి చేస్తారు. వారాహి యాత్ర రాష్ట్ర ప్రజల్లో చైతన్యం, ధైర్యం నింపుతుందని జనసేన నేతలు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details