ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mro bike

ETV Bharat / videos

Revenue staff Strike: ద్విచక్ర వాహన అద్దాలు ధ్వంసం.. పోలీసుల పనేనని రెవెన్యూ సిబ్బంది ఆందోళన - పోలీస్ స్టేషన్ ఎదుట రెవెన్యూ సిబ్బంది నిరసన

By

Published : Jun 15, 2023, 7:35 PM IST

 revenue staff strike in kadapa:  రెవెన్యూ సిబ్బంది ద్విచక్ర వాహనాలు దారికి అడ్డంగా ఉన్నాయని వాటి అద్దాలను పోలీసులు పగలగొట్టారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు  నిరసన తెలియజేసిన ఘటన  వైస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచిన తహసీల్దార్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులే ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రెవెన్యూ  సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన తెలిపారు. 

 పోలీసులు మాత్రం 108 వాహనం వెళ్తుండగా ద్విచక్ర వాహనం కిందపడి ఉంటుందని చెబుతున్నారు.  ఈ ఘటనతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండల ఇన్చార్జి తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మండల మెజిస్ట్రేట్ అయిన తన ద్విచక్ర వాహనం అద్దాలను పగలగొట్టారని తెలిపారు. కనీసం ఫైన్ వేసినా కట్టే వారమని చెప్పారు. పోలీసులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనతోపాటు పలువురి ద్విచక్ర వాహనాల అద్దాలను పగలగొట్టారని వేణుగోపాల్ ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details