Jai Bhim Party President Shravan on Jagan Companies: షేర్ల రూపంలో జగన్ కంపెనీలకు రూ.వేల కోట్లు బదలాయించారు: జడ శ్రావణ్ కుమార్ - Jada Shravan comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 8:27 PM IST
Jai Bhim Party President Shravan on Jagan Companies:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై, ఆయన (జగన్) కంపెనీల పెట్టుబడులపై.. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ షేర్లు కలిపారని అన్నారు. 140 కోట్ల పెట్టుబడికి వందల ఎకరాలు వాళ్లకి దారాదత్తం చేశారని శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. జగతి పబ్లికేషన్స్‌లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టారన్న శ్రావణ్.. షేర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు జగన్‌కు బదలాయించారన్నారు. వీరంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వాళ్లేనని దుయ్యబట్టారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తీసుకున్నారని, ఈ డబ్బులు అన్నీ ఎలా వచ్చాయి..?, పెట్టుబడి ఎలా పెట్టారు..? అని జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
Jada Shravan Kumar Comments:''చంద్రబాబును ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టే.. నేను, పవన్ కల్యాణ్ స్పందించాం. ఈ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేయడం హర్షణీయం. బీజేపీతో కలిస్తే టీడీపీ, జనసేనకు నష్టం. జై భీం పార్టీ మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. చంద్రబాబు, లోకేశ్‌లను జైలులో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ కుట్ర చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారు. 75 స్థానాల్లో జగన్‌ను ఓడించడానికి జై భీం పార్టీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు అరెస్టు సక్రమం అని 150 మంది ఎమ్మెల్యేలు స్పందిస్తే ఇక నేను మీడియా ముందుకు రాను'' అని జై భీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సవాల్ విసిరారు.