Jagananna Colonies సీఎం జగన్ శంకుస్థాపన చేసిన జగనన్నకాలనీ పరిస్థితి ఇది..! - Jagananna colonies which turned like a river
Jagananna Colonies in Anakapalli: పేదల సొంతింటి కల నేరవేరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నవరత్నాలు పేదలు అందరికి ఇల్లు పథకంలోని శంకుస్థాపన చేసిన జగనన్న కాలనీలు చిన్నాభిన్నమయ్యాయి. కాంక్రిట్ పునాదులు వర్షపు నీటికి గాలిలో తేలియాడుతున్నాయి. వేసవిలో కురిసిన గంట వర్షానికి కాలనీలు ఇలా తయారయ్యాయి. కొన్నిచోట్ల లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొట్టుకుపోయాయి.
మరోవైపు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన పైడివాడ జగనన్న కాలనీ చిన్నపాటి వానలకే అస్తవ్యస్తమైంది. 2022 ఏప్రిల్ 28 న సీఎం జగన్ ఈ కాలనీకి భూమి పూజ చేశారు. సమీప ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటికి సరైన దారి చూపుకపోవడంతో.. కాంక్రీట్ పునాదులు గాలిలో తేలియాడుతున్నాయి. అసలు ఈ లే ఔట్ లోకి రావడానికి సరైన రోడ్లు లేవు. బురదలో నిర్మాణాలు కురుకుని పోయాయి. అతి తక్కువ వర్షానికే కాలనీలో ఇలాంటి పరిస్థితుల నెలకొంటే రాబోయే వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు..