ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ETV Bharat / videos

Jagan create record in borrowing అప్పులు, అవినీతిలో జగన్​ది అంచనాలకు అందని రికార్డు: టీడీపీ నేత పట్టాభి - ముఖ్యమంత్రిగా జగన్

By

Published : Jul 30, 2023, 4:59 PM IST

Jagan create record in borrowing: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఆర్బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి.. ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా జగన్ రెడ్డి నిలిపాడని ఆక్షేపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 17 సార్లు ఆర్బీఐ వారు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆక్షన్ నిర్వహించి అప్పులిస్తే.. మన రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా 14 సార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుందని పట్టాభి మండిపడ్డారు. విచ్చలవిడిగా అప్పులు చేసి, భారీ అవినీతికి పాల్పడి దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా జగన్ అవతరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నాలుగు నెలల్లో ఏ రాష్ట్రం కూడా ఇన్ని సార్లు అప్పులు తీసుకున్నది లేదు. ఏపీ 29,500కోట్లు అప్పు తీసుకుంటే, ఆ తర్వాత తమిళనాడు, రాజస్థాన్ 23వేల కోట్లు తీసుకున్నాయి. తెలంగాణ 17వేల కోట్లు తీసుకుంటే.. కర్నాటక ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details