ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jada Sravan Kumar Fires on Jagan Mohan Reddy

ETV Bharat / videos

Jada Sravan Kumar Fires on Jagan Mohan Reddy: చంద్రబాబును ఎన్నికల వరకూ.. జైల్లో ఉంచాలనేదే జగన్ కుట్ర: జడ శ్రావణ్ కుమార్ - Jada Sravan Kumar Fires on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2023, 7:27 PM IST

Jada Sravan Kumar Fires on Jagan Mohan Reddy: జగన్ నియంతలా వ్యవహరిస్తూ.. పౌర హక్కులు హరిస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలపై ప్రశ్నించే గొంతు ఉండకూడదనే.. చంద్రబాబును అరెస్టు (Chandrababu Naidu Arrest) చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని.. అప్పటివరకు చంద్రబాబును జైల్లో ఉంచాలనేదే జగన్ కుట్రని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పౌరహక్కులు హరిస్తున్నారని చెబితే దాడులు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఏడాది తిరిగేసరికల్లా పరిస్థితులన్నీ మారిపోతాయని.. పౌరహక్కులు హరించిన ఒక్క అధికారి కూడా రాష్ట్రంలో ఉండరని జడ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. అప్రజాస్వామిక చర్యలు చేపట్టిన నేతలెవరూ రాజకీయాల్లో ఉండరని తెలిపారు. లెక్కపెట్టి మరీ అందరికీ వడ్డించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత చంద్రబాబుది అని అన్నారు. వైసీపీకు ఓటు వేసిన క్రైస్తవ సోదరులు కంటతడి పెడుతున్నారన్న జడ శ్రావణ్ కుమార్.. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుని పోరాటం చేయాలని స్పష్టం చేశారు.   

ABOUT THE AUTHOR

...view details