Jada sravan Face to Face on CBN Arrest రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబును అరెస్టు చేశారు: అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ - వైసీపీ తీరుపై జడ శ్రవణ్ మండిపాటు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2023, 5:43 PM IST
Jada sravan Face to Face on CBN Arrest: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతుందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు సూచించిన విధి విధానాలను పాటించలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జడ శ్రావణ్ అన్నారు. కేసు నమోదైన 21 నెలల తరువాత బాబును అరెస్ట్ చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపిన వారిని అరెస్టు చేయడం సరికాదని హితవు ఆయన పలికారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలపలేదా..? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసు, అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై.. జడ శ్రవణ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.