ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ITDP_Coordinator_Koppula_Nageswara_Rao_kidnapp

ETV Bharat / videos

ITDP Coordinator Koppula Nageswara Rao Kidnap: ఫొటో చూపించి.. ఇంటి అడ్రస్ అడిగి.. డోర్ కొట్టి కిడ్నాప్ - Kidnapp

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 3:39 PM IST

ITDP Coordinator Koppula Nageswara Rao kidnapp : పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు తెలిపిన వివరాల ప్రకారం..  పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఐ-టీడీపీ కోఆర్డినేటర్ కొప్పుల నాగేశ్వరరావుని తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. 

దాచేపల్లిలోని అపార్ట్‌మెంట్ గోడ దూకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు... వాచ్‌మెన్‌ని బెదిరించారు. కొప్పుల నాగేశ్వరరావు ఫొటో చూపించి 'వీడి ఇల్లు చూపిస్తావా.. లేదా..?' అంటూ గదమాయించారు. వాచ్‌మెన్ భయపడుతూ నాగేశ్వర రావు ఇల్లు చూపించాడు. గోడ దూకి లోపలికి వెళ్లిన నలుగురు వ్యక్తులు.. బయట నుంచి డోర్‌ కొట్టగా.. నాగేశ్వరరావు  తలుపు తీశాడు. వెంటనే ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లారు. ఆపార్ట్‌మెంట్ వాసులు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, ఎవరు మీరు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా నాగేశ్వరరావును తీసుకొని పోయారు. కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు  ఆచూకీ పట్ల ఆందోళనకు గురవుతున్నారు. నాగేశ్వర్ రావు కిడ్నాప్​పై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌, డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రీ, పల్నాడు ఎస్పీలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖలు రాశారు. దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వర రావు అనే ఐ-టీడీపీ సభ్యుడిని పోలీసులు వేకువ జామున అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఐ-టీడీపీ సభ్యుడిని వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని కుటుంబ సభ్యులు భయపడుతున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details