హోంగార్డు ఉద్యోగాలకు కోట్లలో వసూలు? - ఓ సీనియర్ ఐపీఎస్ నిర్వాకం - ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 5:10 PM IST
IPS Officer Cheated And Collected Crores Of Money In Guntur District : హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి దాదాపు 16 కోట్ల రూపాయలకు పైగా కాజేశారని సీనియర్ ఐపీఎస్ అధికారిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో తనను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించే సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
IPS Officer Cheating In Mangalagiri :సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పలుమార్లు ఐపీఎస్ అధికారి ఇంటికి వెళ్లడంతో అరెస్ట్ చేస్తారనే అనుమానంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.