ఆంధ్రప్రదేశ్

andhra pradesh

aarcher_bommadevara_dheeraj

ETV Bharat / videos

ఆసియాక్రీడల్లో అదరగొట్టిన విజయవాడ కుర్రాడు - విలువిద్యలో రజతం సాధించిన ధీరజ్‌ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 5:41 PM IST

Updated : Nov 2, 2023, 5:52 PM IST

Interview with Young Aarcher Bommadevara Dheeraj:ఇటీవల ముగిసిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. అతి క్లిష్టమైన రికర్వ్‌ టీమ్ విభాగంలో వెండి పతకాన్ని సాధించి సత్తా చాటాడు. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన ఈ యువకెరటం కొరియా, జపాన్, చైనీస్ తైపీ వంటి దేశాలు ఆధిపత్యానికి గండికొడుతూ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇలా ఆసియా క్రీడల్లో వెండి పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని ధీరజ్​ అంటున్నాడు.

విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ ఆకాడమీలో విలువిద్యలో ఓనమాలు దిద్దుకున్న ధీరజ్.. అంచెలంచెలుగా ఎదిగి తన ప్రతిభను కనబరుస్తూ వచ్చాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తదుపరి లక్ష్యమంటున్న ధీరజ్.. ఆర్చరీలో తన ప్రయాణాన్ని వివరించారు. ఆర్చరీలో ఒకప్పటి కంటే ఇప్పుడు ఇండియా బలీయమైన జట్టుగా రూపుదిద్దుకుందని అన్నాడు. మేటి జట్లకు బదులిచ్చే సత్తా ఇండియాకు ఉందని ధీరజ్​ అంటున్నాడు. 

Last Updated : Nov 2, 2023, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details