Interview with Dr. Prathap Kumar: 'కిడ్నీ బాధితులు డబ్ల్యూహెచ్‌వో సూచనలు పాటించాలి' - ఏపీ తాజా వార్తలు
Interview With Nephrologist Dr Pratap Kumar about Kidney Problems : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కిడ్నీ మహమ్మారి విస్తరిస్తోంది. ప్రతి ఏడాది కిడ్నీ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతున్నా.. వ్యాధి మూలాలు మాత్రం ఇప్పటివరకు నిరూపణ కాలేదు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులు పెరగడానికి అవగాహన లోపమే ప్రధాన కారణమని అంటున్నారు ప్రముఖ కిడ్నీ వైద్యుడు డాక్టర్ ప్రతాప్ కుమార్. ఆయన అమెరికాలో నెఫ్రాలజిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తూ.. కిడ్నీపై పలు రీసెర్చ్‌లు చేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు.
వ్యాధితో బాధపడతున్న వారిని ముందుగా గుర్తించి.. మంచి వైద్యం అందిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన అంటున్నారు. కిడ్నీ వ్యాధి రాకముందే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండు గ్రాములు లేదా అంత కంటే తక్కువ సోడియం తీసుకోవాలన్నారు. మాంసాహారాన్ని తగ్గించాలని, అలాగే పొగత్రాగడం, మద్యం సేవించడం లాంటివి పూర్తిగా మానుకుని.. మందులు బాగా వాడాలని సూచించారు. కిడ్నీ బాధితులు డబ్ల్యూహెచ్‌వో సూచనలు కచ్చితంగా పాటించాలంటున్న డాక్టర్ ప్రతాప్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.