Interview with Lawyer on Votes Deletion in AP: ఓట్లను చట్టపరంగా తొలగించలేదు.. ఓటరుకు నోటీసు పంపించాలి : న్యాయవాది యశ్వని - Votes Deletion in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 4:30 PM IST
Interview with Lawyer on Votes Deletion in AP: రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు ఎలక్షన్ కమిషన్కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బాపట్ల జిల్లా పర్చూరుతో పాటు విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మిస్సింగ్ అయ్యారంటూ విశాఖలో 25 వేల ఓట్లను తొలగించారంటూ పిటిషనర్ వెలగపూడి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. పర్చూరు నియోజకవర్గంలో బతికి ఉండగానే చనిపోయారంటూ థర్డ్ పార్టీ వ్యక్తులు ఇచ్చిన ఫారం 7 ఆధారంగా వేల సంఖ్యలో ఓట్లను అధికారులు తొలగించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో థర్డ్ పార్టీ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు ఏ కారణాలతో ఓట్లు తొలగించారు.? (How to Delete Vote), ఓట్లు తొలగించాలంటే.. ఏ నిబంధనలు పాటించాలి.. అనే విషయాలపై పిటిషనర్ తరఫు న్యాయవాది పిళ్లా యశ్వనితో మా ప్రతినిధి ముఖాముఖి.