Interview With Dr Nageshwar on Chandrababu Health: చంద్రబాబును వెంటనే ఆస్పత్రికి తరలించాలి.. లేకపోతే తీవ్ర ప్రమాదం: డాక్టర్ నాగేశ్వర్ - Reactions on Chandrababu health
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 9:47 PM IST
|Updated : Oct 15, 2023, 7:22 AM IST
Interview With Dr Nageshwar on Chandrababu Health:చంద్రబాబును వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం పడుతుందని ప్రముఖ వైద్యుడు, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయనకు కచ్చితంగా ప్రత్యేక వైద్యం అందించాలి. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరుగుతుంది అని అన్నారు. ఇప్పుడ కనుక చంద్రబాబుకు సరైన వైద్యం అందించకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ప్రాంతం నుంచి వేరే చోటికి అంటే చల్లగా, శుభ్రంగా ఉన్న ప్రాంతానికి మార్చాలి లేకపోతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. చంద్రబాబు ప్రమాదంలో ఉన్నారు.. అక్కడ ఉన్న వారు ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. డీహైడ్రేషన్, జైలు వాతావరణం మరింత ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందంటున్న డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్‌తో ముఖాముఖి.