ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Interview With Dr.Ashok on Anantapuram Crops

ETV Bharat / videos

Interview With Dr. Ashok on Anantapuram Crops: చిరుధాన్యాలు సాగుచేస్తే నష్టం తప్పించుకోవచ్చు: డా. అశోక్‌ - ap news

By

Published : Aug 8, 2023, 8:55 PM IST

Interview With Dr.Ashok on Anantapuram Crops:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగమనం నుంచి మందకొడిగా ముందుకు సాగటంతో ఆశించిన మేర వర్షాలు రాలేదు. జులై చివర్లో రాయలసీమ జిల్లాల్లో కురిసిన చిరుజల్లులకు చాలా చోట్ల నేల పూర్తిగా పదును కాకపోవటంతో రైతులు విత్తనం వేసుకోలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఖరీఫ్​లో సింహభాగం వేరుసెనగ సాగు చేస్తున్నారు. ఈ సారి వర్షాభావంతో సకాలంలో వర్షం రాకపోవటంతో అనంతపురం జిల్లాలో 44 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 24 శాతం విస్తీర్ణంలో మాత్రమే వేరుసెనగ పంట సాగు చేయగలిగారు. జులై 30తో వేరుసెనగ విత్తుకునే సీజన్ ముగిసిపోవటంతో, ఇకపై రైతులు ఈ పంటను సాగు చేయవద్దని శాస్త్రవేత్తలు సూచించారు. మరో వైపు ఇప్పటికే వర్షాధారంగా సాగుచేసిన వేరుసెనగ, ఆముదం, కంది తదితర పంటలు బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేదని, తక్కువ కాల వ్యవధిలో చేతికొచ్చే చిరుధాన్య పంటలు సాగు చేస్తే కొంతమేర నష్టాన్ని తప్పించుకోవచ్చని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డా. అశోక్ అంటున్నారు. వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డా.అశోక్‌తో ముఖాముఖితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

For All Latest Updates

TAGGED:

Rains in ap

ABOUT THE AUTHOR

...view details