Interview with Jamaliah: 'రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. కొర్రీలతో వేధిస్తోంది' - AP Latest News
Interview with AP Rythu Sangam State Secretary: ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనుకోని వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలకు తడిసిపోవటంతో రైతులు అల్లాడుతున్నారు. అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో రైతులు నిండా మునిగితే ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని ఏపీ రైతు సంఘం మండిపడింది. కోలుకోలేని దెబ్బతిన్న రైతుల్ని ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. నిబంధనల పేరుతో కొర్రీలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్ర సింగ్ హుడా కమిటీ సిఫార్సులను అమలు పరచాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదంటున్నారు. వాణిజ్య పంటలకు ఎకరాకు 70వేలు, ఆహారపంటలకు 50వేలు, ఉద్యాన పంటలకు లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని తేల్చి చెప్తున్నారు. పంట నష్ట పరిహారం నమోదులో కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్యతో ముఖాముఖి.