International Tigers Day 2023 : నంద్యాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా 2కే రన్... - కర్నూలు వార్తలు
International Tigers Day in Nandyala : జులై 29 ప్రపంచ పులుల దినోత్సవ వేళ... పులుల సంరక్షణ, ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.. జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు పులుల సంరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా అడవులను పరిరక్షించుకోవటం మన బాధ్యత అంటూ.. జులై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా... నంద్యాలలో 'రన్ ఫర్ నల్లమల టైగర్స్ ' కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కర్నూలు వెళ్లే బైపాస్ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు 2కె రన్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, డి.ఎఫ్.వో వినిత్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పులులను సంరక్షిస్తే ఆరోగ్యకరమైన అడవులతో పాటు.. ఇతర జంతువుల మనుగడ సాధ్యం అవుతుందన్నారు. అడవులను కాపాడి భావితరాలకు అందించటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, డీఎస్పీ మహేశ్వ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.