Internal Clashes Between YCP Leaders At Kuppam: కుప్పం వైసీపీలో వర్గపోరు.. రోడ్డెక్కిన మహిళలు.. - చిత్తూరు జిల్లా కుప్పం మండలం వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 5:51 PM IST
Internal Clashes Between YCP Leaders At Kuppam for Cattle Race: చిత్తూరు జిల్లా కుప్పం మండలం వానగుట్టపల్లి వైసీపీలో వర్గపోరు ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వానగుట్టపల్లిలో పశువుల పరుగు పందెం నిర్వహణకు అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీటీసీ(MPTC) వర్గీయులు ఏర్పాట్లు చేశారు. దీనిపై పంచాయతీ వైసీపీ(ysr congress party ) అధ్యక్షుడు కృష్ణప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీలో విలువ లేదంటూ శనివారం కృష్ణప్ప రాజీనామా చేశారు. గ్రామపంచాయతీ పార్టీ అధ్యక్షుడితో పాటు సర్పంచ్‌కి తెలియకుండా పశువుల పరుగు పందెం నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
ఈనేపథ్యంలో.. పశువుల పరుగు పందెం(Cattle race) నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీటీసీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి మహిళలు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికే పశువుల పరుగు పందెం నిర్వహించడానికి సుమారు.. రూ.4లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. తమ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పార్టీలో వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.