ఇంటర్ విద్యార్థినిపై పక్కింటి యువకుడి లైంగికదాడి - వాట్సాప్ స్టేటస్‌లో అశ్లీల వీడియోలు - కదిరి మండలంలో ఇంటర్ విద్యార్థిని రేప్ కేసు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 12:49 PM IST
Inter Student Raped By Neighbour: సత్యసాయి జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై డిగ్రీ స్టూడెంట్ బలాత్కారం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదిరి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. దసరా సెలవులకు ఇంటికొచ్చింది. తల్లిదండ్రులు గొర్రెలను మేత కోసం అడవికి తోలుకెళ్లారు. ఇంటి వద్ద పనుల్లో నిమగ్నమైన విద్యార్థినిని పక్కింటికి చెందిన డిగ్రీ చదువుతున్న ప్రసన్న కుమార్ అనే యువకుడు పలకరించాడు. మాటల సందర్భంగా తనలోని దురాలోచనను బయటపెట్టాడు. విద్యార్థినికి సంబంధించిన అశ్లీల చిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ ఆమెను బెదిరించి బలవంతంగా గడ్డివాము పక్కకు లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తన ఫోన్‌తో వీడియోలను తీశాడు.
Girl Raped By Neighbour: వీడియోలను అడ్డంపెట్టుకుని విద్యార్థినిని పలుమార్లు బెదిరిస్తూ వచ్చాడు. దసరా సెలవులు ముగియగానే విద్యార్థిని కళాశాలకు వెళ్లిపోయింది. అయితే ఆమెను గ్రామానికి రావాలంటూ యువకుడు పట్టుబట్టాడు. బాలిక ఇంటికి రాకపోతే.. తన వద్ద ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అయితే అందుకు బాలిక నిరాకరించటంతో ఆమెతో ఉన్న అశ్లీల వీడియోలను యువకుడు తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. కదిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.