Indrakeeladri EO on Teppotsavam Celebrations: ఇంద్రకీలాద్రిపై ముగింపు దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు.. దుర్గామల్లేశ్వర స్వామి జలవిహారానికి పూర్తైన ఏర్పాట్లు.. - విజయవాడలో దసరా ఉత్సవాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 4:07 PM IST
Indrakeeladri EO on Teppotsavam Celebrations: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ నవమి, దశమి సందర్భంగా రెండు అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సందడితో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో దసరా ఉత్సావాలలో భాగంగా చివరి రోజున దుర్గామల్లేశ్వర స్వామి కృష్ణానదిలో జలవిహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఈ ఏడాది దసరాలో ఒకేరోజు అమ్మవారి రెండు అలంకరణల దృష్ట్యా మధ్యాహ్నం రెండు గంటలపాటు దర్శనాలను నిలిపివేసి అనంతరం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై ఆలయ ఈవో కేఎస్ రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి..