ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Independence_Day_Arrangements

ETV Bharat / videos

Independence Day Arrangements: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం - Independence Day Arrangements in vijayawada

By

Published : Aug 14, 2023, 7:42 PM IST

Updated : Aug 15, 2023, 6:27 AM IST

Independence Day Arrangements: రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను మువ్వన్నెల జెండాలతో తీర్చిదిద్దారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం పోలీసులు, ఇతర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారని ప్రభుత్వం తెలియచేసింది. సీఎం ప్రసంగం కంటే ముందు వివిధ శాఖలకు చెందిన శకటాలు కూడా స్టేడియంలో ప్రదర్శన నిర్వహిస్తాయని తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్​లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్​తో జెండా వందనం చేయించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లితండ్రుల కమిటీ ఛైర్మన్ హాజరు కాని పక్షంలో ప్రధానోపాధ్యాయుడు జెండావందనం కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Aug 15, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details