ఆంధ్రప్రదేశ్

andhra pradesh

inauguration_srinivasa_divyanugraha_homam

ETV Bharat / videos

టీటీడీ ద్వారా మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలు: భూమన కరుణాకర్​ రెడ్డి - శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహవిశేష హోమము

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 4:58 PM IST

Inauguration of Srinivasa Divyanugraha Vishesha Homam: రానున్న రోజుల్లో టీటీడీ ద్వారా మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి సమీపంలోని సప్తగో ప్రదక్షిణ ప్రాంగణంలో.. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహవిశేష హోమము ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. 

శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో.. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహవిశేష హోమం ప్రారంభోత్సవ కార్యక్రమ ఊరేగింపులో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు వేద విద్యార్థులు, అధ్యాపకులు, కళాకారులు ఊరేంగిపుగా సప్తగో ప్రదక్షిణ ప్రాంగణానికి చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీవారి పాదపద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details