ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమ మట్టి తవ్వకాలు

ETV Bharat / videos

Illegal Soil Excavation: దేన్నీ వదలడం లేదు.. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు - అక్రమ మైనింగ్

By

Published : May 30, 2023, 7:14 PM IST

Illegal Soil Mining: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులు తవ్వేసి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. దాని ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం అటువైపు కూడా చూడటం లేదు. దీంతో చెరువులు స్వరూపాన్ని కోల్పోతున్నాయి. జేసీబీలతో మట్టిని పెకలించి ఇటుక బట్టీలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.  ఇటుక బట్టీలలో పెద్ద ఎత్తున మట్టి దిబ్బలతో డంప్​లు చేశారు. 

మట్టితోపాటు పచ్చని చెట్లను కూడా జేసీబీలు పెకిలించి వేస్తున్నాయి. ప్రధాన రహదారుల ప్రక్కనే బట్టీలు ఉండడంతో మట్టి, దుమ్ము, బూడిదతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మైలవరం, జి.కొండూరు మండలాలో తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు మొద్దు నిద్రను వీడటం లేదు. మైలవరం మండలంలోని పుల్లూరు, తోలుకోడు, జి.కొండూరు మండలంలోని కుంటముక్కల, వెల్లటూరు, చెవుటూరు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మట్టి మాఫియా సాగుతోంది. ఇంత జరుగున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.. విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details