ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal_Sand_Transportation_in_NTR_District

ETV Bharat / videos

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, నిమ్మకునీరెత్తినట్లు అధికారులు - వైసీపీ నేతల ఇసుక దందా న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 1:36 PM IST

Illegal Sand Transportation in NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కొత్త కంచల గ్రామం వద్ద మున్నేరు నుంచి టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇదే ప్రాంతంలో కీసర వంతెన వద్ద ఇసుక గుంతలో పడి ఇటీవలే ముగ్గురు యువకులు దుర్మరణం చెందినా పోలీసు, రెవిన్యూ, గనులశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవట్లేదని వాపోయారు. ఫలితంగా అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

YCP Leaders Sand Mafia: ఆర్డీవో, ఏసీపీ కార్యాలయాల ముందు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా గనులశాఖ అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా(Illegal Sand Transportation) జరుగుతోందని అంటున్నారు. దీనికి ముఖ్య నాయకులు సహకరిస్తూ ఉండటంతో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తురని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి.. ఇసుక అక్రమ రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details