ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal_Sand_Transport_in_Bapatla

ETV Bharat / videos

ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదుపై కొరవడిన అధికారులు స్పందన - Addanki Illegal sand Transport by ycp leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 4:05 PM IST

Illegal sand Transport in Bapatla: ఇసుక అక్రమ రవాణా(sand illegal Transport)లో వైసీపీ(YCP) నేతలు హవా కొనసాగిస్తున్నారు. ఏదో ప్రాంతంలో నిత్యం ఇసుకను అక్రమంగా లారీలు, ట్రాక్టర్లలో తరలుతోంది. రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తుండగా గ్రామస్థులకు చిక్కినా.. అధికారులకు ఫిర్యాదు అందినా వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటన తిమ్మాయపాలెం వద్ద చోటుచేసుకుంది.  

Authorities not Responding on Sand Illegal Transport Complaint: బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద గుండ్లకమ్మ నదిలో అధికారపార్టీ నాయకులు అక్రమంగా ఇసుకను రాత్రి వేళలలో తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక 6జేసీబీ(JCB)లు, 50ట్రాక్టర్ల(Tractor)తో తవ్వకాలు మొదలుపెట్టారు. జేసీబీ,ట్రాక్టర్లు చేసే శబ్దాలను స్థానికులు గ్రహించి రామాయపాలెం, అద్దంకి చెందిన వైసీపీ నేతలు ఇసుకను తరలిస్తున్నారని  ఫోన్లు ద్వారా సెబ్(SEB), పోలీసు, రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల అండతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యనాయకులు సహకరిస్తుండటం వల్లే అడ్డు అదుపూ లేకుండా ఇసుక అక్రమాలు పెరిగిపోతున్నాయని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను ఆపాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details