'తెల్లరాయి తరలిస్తున్న లారీలు పట్టుకోండి' - 'అవి మా వాళ్లవే వదిలేయండి'! వైసీపీ వర్గ పోరులో తలపట్టుకుంటున్న మైనింగ్ అధికారులు - తెల్లరాయి అక్రమ మైనింగ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 4:30 PM IST
Illegal Mining in Nellore District :నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి అక్రమంగా తరలిపోతున్న తెల్లరాయి లారీలను మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు. రాత్రి నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 20 లారీలను పట్టుకుని గూడూరులో సీజ్ చేశారు. రాత్రుల్లు యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మేనింగ్ క్వారీలో తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారంతో అధికారుల అకస్మిక దాడులు. 20 అక్రమంగా తెల్లరాళ్లను తరలిస్తున్న 20 లారీలు పట్టుబడినప్పటికీ మరో 10లారీలు హైవే నుంచి తరలి పోయినట్లు సమాచారం.
Ministers Fight For Mining Lorrys in AP : పట్టుకున్న లారీలను వదిలి పెట్టమని ఓ మంత్రి సిఫార్స్ చేసినట్లు తెలిసింది. ఒక మంత్రి పట్టుకోమంటే మరొకరు వదిలి పెట్టమని ఒత్తిడి చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. నెల్లూరుకు చెందిన వైసీపీ నాయకులు తెల్ల రాయిని ఆరు నెలలుగా అక్రమంగా తరలిస్తున్నారు. దేశంలో సైదాపురం క్వార్ట్జ్ డిమాండ్ పెరగడంతో ముగ్గురు మంత్రులు మధ్య పోటీ నెలకొంది.