Illegal Mining in Anakapalle District: అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి ఎన్జీటీకి నివేదిక ఇస్తాం: కలెక్టర్
Illegal Mining in Anakapalle District :అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారులో జరుగుతున్న అక్రమ లేటరైట్ మైనింగ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ బృందం పరిశీలన చేసింది. ఈ ప్రాంతంలో జాతీయ పర్యావరణ అనుమతులు లేకుండా అనధికారికంగా.. తవ్వకాలు జరుపుతున్నారని ఈ ప్రాంతానికి చెందిన దళిత ప్రగతి ఐక్య సంఘ నేత కొండ్రు మరిడియ అనే వ్యక్తి ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి నేతృత్వంలో జాతీయ పర్యావరణ నిపుణులు, గనుల శాఖ సహాయ సంచాలకులు, జాతీయ శాస్త్రవేత్తలు, అటవీ, రెవెన్యూ అధికారులు మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ మేరకు అధికారులు లేటరైట్ మైనింగ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ.. మైనింగ్ తవ్వకాల అనుమతులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అక్రమ మైనింగ్ పై సమగ్రంగా విచారణ జరిపి ఎన్జీటీకి నివేదిక అందిస్తామని జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలిపారు.