ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal_Gravel_Mining_From_Airport_Lands

ETV Bharat / videos

విమానాశ్రయ భూముల్లో గ్రావెల్‌ అక్రమ రవాణా - వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ నేతల ఆగ్రహం - Illegal Gravel Mining in damavaram Airport Lands

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 10:39 PM IST

Illegal Gravel Mining From Airport Lands: నెల్లూరు జిల్లాలోని దామవరం విమానాశ్రయ భూముల్లో అడ్డూ అదుపు లేకుండా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో చలో దామవరం కార్యక్రమాన్ని చేపట్టారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం విమానాశ్రయ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను, గుంతలను చూపించారు. 

విమానాశ్రయ భూముల్లో జరిగిన అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా విమానాశ్రయ నిర్మాణానికి టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పైలాన్​కు పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయుకులు చేస్తున్న గ్రావెల్ దోపిడీని ఖండిస్తున్నామని, ఎయిర్ పోర్టు భూముల్లోనే ఇంతటి అవినీతికి పాల్పడ్డ వైసీపీ నాయకుల్ని ఏమనాలో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, కావలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొమ్మి సురేంద్రతో పాటు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details