ఆంధ్రప్రదేశ్

andhra pradesh

husband_murdered_by_wife_due_to_illegal_affair_in_ntr_district

ETV Bharat / videos

క్షమించి వదిలేస్తే ప్రాణం తీసింది - ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వివాహేతర సంబంధం హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 5:20 PM IST

Husband Murdered By Wife Due to Illegal Affair In NTR District :జీవితాంతం చెయ్యి పట్టుకుని తోడూ నీడగా ఉండాల్సిన భార్యే అతడి పాలిట మృత్యువుగా మారింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు పట్టుబడింది. చివరకు భర్తనే కాటికి చేర్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు ఎస్సీ కాలనీలో వివాహేతర సంబంధం కారణంగా పాస్టర్ యాదాల శ్రీనివాసరావు (58) అలియాస్ ఏలియా దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీనివాసరావు భార్య మరొక వ్యక్తితో కలిసి తన భర్తను కిరాతకంగా హత మార్చింది.

మృతుడి భార్య వాణి మరొకరితో కలిసి ఉండగా భర్త చూశాడు. దీంతో వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. చివరకు భర్త ఇంట్లో పడుకొని ఉండడం గమనించిన వాణి తన ప్రియుడుతో కలిసి శ్రీనివాసరావు గొంతుకి వైరు బిగించి హతమార్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details