ఆంధ్రప్రదేశ్

andhra pradesh

19350074_thumbnail_16x9_one_missing_who_ventured_into_godavari.jpg

ETV Bharat / videos

కొవ్వూరులో విషాదం.. గోదావరి ప్రవాహంలో భర్త గల్లంతు.. సురక్షితంగా ఒడ్డుకు భార్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 9:56 PM IST

Husband Missing Wife Safe in Godavari River Incident: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం దగ్గర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి దిగిన భక్తుడు గల్లంతు కాగా.. మరో ఇద్దరు ప్రాణాలు దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరుకు చెందిన ఇనమల కార్తీక్ కుటుంబం తణుకులో శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు గోష్పాద క్షేత్రానికి వచ్చారు. కార్తీక్​తో పాటుగా.. భార్య భవానీ, బంధువు అప్పలనాయుడు నీటిలోకి దిగారు. అయితే, కొంత సేపటికే నీటిలో వచ్చే వడిలో చిక్కుకున్నారు. ప్రమాదం నుంచి అతికష్టంపై కార్తీక్ భార్య భవానీ, బంధువు అప్పలనాయుడు బయటపడ్డారు. కార్తీక్ మాత్రం నీటి ప్రవాహంలో  కొట్టుకుపోయినట్లు అతని బంధువులు వెల్లడించారు. నదీ ప్రవాహంలో కార్తీక్ కొట్టుకుపోతున్న సమయంలో  కుటుంబ సభ్యుల కేకలు, రోదనలు మిన్నంటాయి. ఆటో డ్రైవర్​గా జీవనం సాగిస్తున్న కార్తీక్​కు నాలుగేళ్ల కుమారుడు, 8 నెలల పాప ఉన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్తీక్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘాట్ వద్ద కనీస రక్షణ చర్యలు, లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details