ఆంధ్రప్రదేశ్

andhra pradesh

husband_killed

ETV Bharat / videos

వ్యసనాలకు బానిసైన భర్తను మందలించిన భార్య - ఆవేశంతో హత్య - Vizianagaram crime news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 5:24 PM IST

Husband Killed Wife And Ran Away :వ్యసనాలకు బానిసైన భర్తను భార్య మందలించదన్న ఆవేశంతో ఆమెను హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామంలో భార్యను హత్య చేసి భర్త పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన పరిశీలించి కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునకాల లక్ష్మీ, మునకాల సత్యం అనే దంపతులు కొండగండ్రేడు గ్రామంలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వీరికి ఇద్దరు సంతానం అని తెలియజేశారు. గత కొంత కాలంగా మునకాల సత్యం వ్యసనాలకు బానిసై గ్రామంలో సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అప్పులు చేసి తరచూ భార్యతో గొడవ పడేవాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మునకాల లక్ష్మీ మందలించిందని మద్యం మత్తులో ఉన్న సత్యం భార్యని కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించడం వల్ల భర్త పరారయ్యాడు. సత్యంపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details