Farmers Rally Against R5 Zone: ఆర్5 జోన్‌ని నిరసిస్తూ.. రైతుల ర్యాలీ - Huge rally of farmers In Thullur
Farmers Rally Protesting R5 Zone: రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్‌ను నిరసిస్తూ తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి సీఆర్డీఏ ఆఫీస్ వరకు అన్నదాతలు పాదయాత్రగా వెళ్లారు. సెంటు స్థలము వద్దు.. టిడ్కో ఇల్లు ముద్దు అంటూ నినాదాలు చేశారు. సీఆర్డీఏ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్లు వేసి రైతులను అడ్డుకున్నారు. రైతులు వాటిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌కు ఆర్5 జోన్‌ని రద్దు చేయాలని వినతి పత్రం అందించారు.
ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు హెచ్చరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలని, రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఉన్న ప్రజలకు పట్టించుకోకుండా.. ఎక్కడో ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. రాజధానిలో ఉంటున్న వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రైతులకు కౌలు కూడా వేయడం లేదని మండిపడ్డారు.