ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Huge_Python_on_Road_in_Jammalamadugu

ETV Bharat / videos

రోడ్డుపై భారీ కొండ చిలువ - భయబ్రాంతులకు గురైన వాహన చోదకులు - Massive Python Crosses Road Goes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 1:32 PM IST

Huge Python on Road in Jammalamadugu :వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది.  కొండ చిలువ సంచారంతో స్థానికులు  ఆందోళన గురయ్యారు. శుక్రవారం రాత్రి తాడిపత్రి రోడ్డులో పోలీస్ పెట్రోల్ బంకు వద్ద 6 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువ సంచరించడాన్ని స్థానికులు గమనించారు.  రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండటంతో వాహన చోదకులు దానిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాని తప్పించుకుని పారిపోవడంతో అక్కడే ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై సంచరిస్తునప్పుడు కొందరు సెల్ ఫోన్లలో వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. 

Python Snake Videos Viral in Social Media :సుమారు నెల రోజుల క్రితం జమ్మలమడుగులోని నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఏడు అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను గుర్తించారు. ఇవి వేర్వేరా, ఒకటేనా తేలాల్సి ఉంది. అటవీ శాఖ అధికారులు స్పందించి దానిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి  భారీ కొండ చిలువను పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details