Huge Fraud in Exchange Rs.2000 Notes in Nandyal: నంద్యాలలో 2 వేల నోట్ల మార్పిడి మోసం.. ఇద్దరు అరెస్టు - ap crime
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 12:19 PM IST
Huge Fraud in Exchange Rs.2000 Notes in Nandyal :రద్దవుతున్న 2 వేల రూపాయల నోట్ల మార్పిడిలో భాగంగా జూలైలో భారీ మెుత్తం నగదును అపహరించిన ముఠాలో.. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న 70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. గుంతకల్‌కు చెందిన వర ప్రసాద్ తమ వద్ద 2 వేల నోట్లు ఉన్నాయని.. వాటిని మార్పు చేస్తే పదిహేను శాతం కమీషన్ ఇస్తామని నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డిని నమ్మించాడు. అందుకు అంగీకరించిన శ్రీనివాసరెడ్డి మరో ఐదు మందితో కలిసి 2 కోట్ల 20లక్షల రూపాయలు సిద్దం చేసుకున్నారు. తరువాత వర ప్రసాద్ చేప్పిన ప్రాంతానికి వెళ్లాడు. ఈ ఏడాది జూలై 20న నంద్యాల సమీపంలోని రైతు నగరం వద్ద 8 మంది ముఠా రెండు వాహనాల్లో వచ్చి శ్రీనివాసరెడ్డిని బెదిరించి అతని వద్ద ఉన్న నగదు తీసుకుని ఉడాయించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగత వారిని త్వరలో పట్టుకుని మిగిలిన నగదు మెుత్తాన్ని రికవరీ చేస్తామని నంద్యాల డీఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.
TAGGED:
massive fraud in nandyala