ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu_Raa_Kadali_Raa_Public_Meeting

ETV Bharat / videos

తిరువూరులో తెలుగుదేశం 'రా కదలిరా' బహిరంగ సభ - భారీగా తరలివచ్చిన ప్రజలు - Raa Kadali Raa Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 1:22 PM IST

Huge Crowd at TDP Chandrababu Raa Kadali Raa Public Meeting: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం నిర్వహిస్తున్న "రా కదిలిరా" బహిరంగ సభ ఘనంగా ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణ సరిహద్దు కావటంతో ఖమ్మం జిల్లా నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి నేతలు భారీ వాహన ర్యాలీలు చేపట్టారు. నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్ల ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. 

వేలాది వాహనాలతో ప్రదర్శనగా సభాస్థలికి చేరుకున్నారు. తిరువూరులో సభ తర్వాత సాయంత్రం ఆచంటలో జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( TDP Chief Chandrababu Naidu) పాల్గొంటారు.  చంద్రబాబు విడుదల తర్వాత తిరువూరులో నిర్వహించబోతున్న మొదటి సభ కావడంతో నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. 60 ఎకరాలను సభ కోసం సిద్ధం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details