అదరగొట్టిన గుర్రపు స్వారీ పోటీలు ఎక్కడంటే - ఏపీ తాజా వార్తలు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఏర్రవరంలో నల్లగొండమ్మ అమ్మవారి పండగను పురస్కరించుకుని జిల్లాస్థాయి గుర్రపు స్వారీ పోటీలు నిర్వహించారు. వీటిని స్ధానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. పోటీలకు ముందు అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా స్థాయి గుర్రపు స్వారీ పోటీలలో విశాఖ, అనకాపల్లి, పాడేరు ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన ముగ్గురికి బహుమతులను అందజేశారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST