కిడ్నీ బాధితులకు హోమియోపతి వైద్య విధానంపై పరిశోధన చేయాలి : హోమియోపతి వైద్యుల రాష్ట్ర స్థాయి సమావేశం - Homeopathic Doctors Meeting in Vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 11:00 PM IST
Homeopathic Doctors State Level Conference at Vijayawada:హోమియోపతి చికిత్సాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్ రాష్ట్ర కార్యదర్శి డా.భాస్కర్ రావు అన్నారు. విజయవాడ ఐలాపురంలో హోమియో పతి వైద్యుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోమియోపతి వైద్య కళాశాలలను మరింత మెరుగు పరచాలని, బోధనా సిబ్బందిని నియమించాలని కోరారు. జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రి విభాగాలను హోమియోపతి పీజీ కోర్సుల్లో విద్యావిభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. పశు అగ్రికల్చర్ విభాగాలలో హోమియోపతి మందులతో పరిశోధన చేయాలని కోరారు. ఉద్ధానం, ఏ కొండూరు గ్రామాల్లో కిడ్నీ బాధితులకు హోమియోపతి వైద్య విధానం ద్వారా పరిశోధన చేయాలని కోరారు. జిల్లాకి ఒక 20 పడకల హోమియో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హోమియో వైద్యం ద్వారా అన్ని రకాల ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.