ఆంధ్రప్రదేశ్

andhra pradesh

home_minister_commettee_on_fire_security_in_vijayavada

ETV Bharat / videos

అగ్నిమాపక భద్రతా ప్రమాణాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు తప్పనిసరి - హోం మంత్రి తానేటి వనిత - ఏపీ హోం మంత్రి తానేటి వనిత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 8:10 PM IST

Home Minister On Fire Safety :అగ్నిమాపక భద్రతా ప్రమాణాల్ని పాటించటంలో దేశవ్యాప్తంగా ఆనుసరిస్తున్న నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు తప్పనిసరి అని ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రాలను వికేంద్రీకరించటంతో పాటు ఆపరేషన్ సౌలభ్యం, నిర్వహణ, ఫైర్ ఎన్వోసీ ప్రక్రియను సులభతరం చేయడం, భద్రతా ప్రమాణాలను పాటించేలా చేయాల్సి ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా గృహాలు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య, ప్రభుత్వ భవనాల్లో అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా నిబంధనల కోసం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు అధికారులు వివరించారు. ఎన్ బీసీ ఆధారిత అగ్నిమాపక పరికరాలకు బదులుగా ప్లంజర్ పంపులను సూచిస్తూ ఎన్బీసీ కోడ్ మార్గదర్శకాలకు ప్రత్యామ్నాయాలను సూచించినట్టు తెలిపారు.  

AP Home Minister : గెజిట్​లో సెట్ బ్యాక్, ఖాళీ స్థలం, బ్యాంకు హామీ, ఫైర్ ప్లాన్ లకు సంబంధించి కొన్ని సడలింపులను ఇచ్చాయని వాటిని నిర్ధారించడానికి స్థానిక భవనాల నిబంధనలను అనుసరించాలని విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్, అగ్నిమాపక కమిటీ సిఫార్సు చేసింది. ఐదేళ్ల వరకూ ఎన్వోసీలకు చెల్లుబాటు వ్యవధిపై మార్పులు చేయాల్సిందిగా కమిటీ సిఫార్సు చేసింది. నివాస భవనాలకు 3 ఏళ్లు, ఆస్పత్రులు, వాణిజ్య కేంద్రాల వంటి ప్రాంగణాలకు రెండేళ్ల కాలవ్యవధి ఉంచాలని పేర్కొంది.  అలాగే ప్రమాదకర పరిశ్రమలకు ఒక ఏడాది కాలపరిమితి ఉండాలని సూచించారు. కొన్ని తక్కువ ప్రమాదకర కట్టడాలను అగ్ని మాపక అధికారుల తనిఖీ నుండి మినహాయిందాలని కమిటీ సిఫార్సుచేసింది. అగ్నిమాపక శాఖకు బ్రిటీష్ కాలం నాటి యూనిఫాం కోడ్​ మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details