Balayya at Pulletikurru: పుల్లేటికుర్రులో బాలకృష్ణ సందడి.. అభిమానుల ఆనందోత్సాహం - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
Balayya Sandadi in Pulletikurru : హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో సందడి చేశారు. స్థానికంగా ఉన్న కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి ఇంటికి వచ్చిన ఆయన.. ముందుగా గ్రామంలోని చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగ మల్లేశ్వర సిద్ధాంతి ఇంట్లో కొద్దిసేపు గడిపిన బాలకృష్ణ.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న తన అభిమానులను కలుసుకుని, అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాలకృష్ణతో ఫొటో తీయించుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. సెల్ ఫోన్లలో బాలయ్యను ఫొటోలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరో గ్రామానికి రావడంపై పుల్లేటికుర్రు వాసులు సంబరపడ్డారు. చిన్న పిల్లలు, వృద్ధులు సైతం బాలకృష్ణను చూసేందుకు సిద్ధాంతి ఇంటి పరిసరాల్లో పెద్ద ఎత్తున గుమిగూడారు.