ఆంధ్రప్రదేశ్

andhra pradesh

hindu_dharmika_parishad_leaders_comments

ETV Bharat / videos

ఏపీలో దేవాలయాలకు భూములిచ్చేందుకు ప్రజలు మందుకు రావడం లేదు: హిందూ ధార్మిక పరిషత్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 8:21 PM IST

Hindu Dharmika Parishad Leaders Comments: ఏపీలో హిందు దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోతోందని హిందూ ధార్మిక పరిషత్​ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో దేవాలయాలకు భూములు దానం చేయాలంటే ప్రజలు ముందుకు రావడం లేదని వారు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కలిసి విజయవాడలో సమావేశమైనట్లు వారు తెలిపారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ హిందూ డిక్లరేషన్​ను​ ప్రకటించాలని, రాబోయే ఎన్నికల్లో ఆ డిక్లరేషన్​ను మేనిఫేస్టోలో పెట్టాలని వారు డిమాండ్​ చేశారు. రాజకీయాలకు అతీతంగా హిందు కమిషన్​ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో హిందూ దేవుళ్ల రథాలను ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయని మండిపడ్డారు.  తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాల్లో త్వరలోనే రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత లక్ష మంది హిందువులతో బహిరంగ సభనూ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details