విశాఖలో ఉద్రిక్త వాతావరణం- టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట - విశాఖలో ఉద్రిక్తత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 1:32 PM IST
High Tension at Visakha: విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధురవాడలో జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో తెలుగుదేశం, వైెఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట(Clash Between TDP and YSRCP Leaders) జరిగింది. స్థానిక కార్పొరేటర్ లేకుండానే ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు(MLA Muttamshetty Srinivasa Rao) ప్రారంభించారు. ప్రొటోకాల్(Protocol) పాటించలేదంటూ టీడీపీ కార్పొరేటర్ హేమలత(TDP corporator Hemalatha) మండిపడ్డారు.
Argument between TDP Leaders and Police: దేవాలయం ఉన్న ప్రాంతంలో ఓపెన్ జిమ్(Open Gym) ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన సామాజిక భవనాన్ని సచివాలయానికి ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు. నిరసన చేస్తున్న వారిని బయటకు లాగేయాలంటూ పోలీసులను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులను, టీడీపీ నేతలను పోలీసులు బయటకు నెట్టేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.