ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరెంటు బిల్లు

ETV Bharat / videos

High Electricity Bill: రెండు ఫ్యాన్లు, బల్బులు.. బిల్లు చూస్తే షాక్​ - today telugu news ap live

By

Published : Jun 11, 2023, 1:47 PM IST

High Electricity Bill in Anakapalli District : ఆమె ఓ దినసరి కూలి.. నివాసం ఉంటోంది చిన్న ఇంట్లో. వినియోగించే విద్యుత్​ పరికరాలు కూడా అంతంత మాత్రమే . కానీ, రెండు నెలలకు కలిపి విద్యుత్​ బిల్లు మాత్రం ఊహించని రీతిలో వచ్చింది. ఆ బిల్లును చూసి ఆమె లబోదిబోమంటోది. అంత మొత్తంలో రావటంతో ఆందోళనకు గురైంది. అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామానికి చెందిన అట్ట లక్ష్మి అనే మహిళ దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. భర్త మరణించటంతో ఒంటరిగానే జీవిస్తోంది. ఇంట్లో రెండు ఫ్యాన్లు, బల్బులు ఒక టీవీ ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన మీటర్​ రీడింగ్​ తీసిన విద్యుత్​ సిబ్బంది.. బిల్లు 9.81 లక్షలు వచ్చిందని లక్ష్మికి చెప్పడంతో ఒక్కసారిగా నివ్వెరపోయింది.  బిల్లును చూసిన ఆమె.. సిబ్బందిని ప్రశ్నించగా సమస్యను గుర్తించి.. మళ్లి రీడింగ్​ తీశారు. దాంతో గత నెల, ఈ నెల.. రెండు నెలలకు కలిపి విద్యుత్​ బిల్లు 856 రూపాయలు వచ్చింది. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. గత నెలలో అనారోగ్య కారణాలతో బిల్లు చెల్లించలేదని.. అప్పుడు 300 రూపాయలు వచ్చిందని ఆమె తెలిపింది. మీటర్ రీడింగ్ సరిగా తీయక పోవడంతో ఈ సమస్య వచ్చినట్లు విద్యుత్ శాఖ సిబ్బంది గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details